హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఓల్డ్ మారేడ్‌పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మురికివాడల అభివృద్ధి సవాల్‌తో కూడుకున్న అంశమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సవాళ్లను అధిగమించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని స్పష్టం చేశారు. డిగ్నిటీ హౌసింగ్ కార్యక్రమం కింద డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి.. నిరుపేదలకు ఆ ఇండ్లను అందజేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఓల్డ్ మారేడ్‌పల్లిలో 468 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Pleased to be handing over 468 2BHK homes at Old Maredpalli built under #DignityHousing program of #Telangana Govt
Slum redevelopment is a challenge & #KCR Govt is at the forefront in addressing it
Before & After pictures👇 are a clear reflection of the same pic.twitter.com/F2TYGk93DC
— KTR (@KTRTRS) March 3, 2022