హైదరాబాద్: నేడు హైదరాబాద్లో మరో వంతెనను ప్రారంభించనున్నారు. అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం ఉదయం 11 గంటలకు చాంద్రాయణగుట్ట పైవంతెన ప్రారంభంకానుంది. ఈ వంతెన నిర్మాణంతో శంషాబాద్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ప్రయాణించడం మరింత సులభతరం కానుంది. అలాగే నల్గొండ, వరంగల్ వెళ్లడం కూడా మరింత సులభం అవుతుంది. మొత్తం రూ.45.79 కోట్లు పెట్టి ఈ వంతెన నిర్మించారు.