సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో వరుస అగ్ని ప్రమాదాలు అలజడి రేపుతున్నాయి. జనాల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. మానవ నిర్లక్ష్యం, సరైన నిఘా, అప్రమత్తత లేక భారీ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన ఈవీడీఎం (ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్) బృందం అగ్ని ప్రమాద సమయంలో వ్యవహరించాల్సిన తీరు, అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కరపత్రాలను రూపొందించి విస్తృత అవగాహన చేపడుతున్నది. రెండు రోజుల కిందట పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ అవగాహన కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలు, వాణిజ్య సముదాయాల్లో అప్రమత్తతపై అవగాహన కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రజలకు పలు సూచనలు ఇస్తున్నారు. ప్రతి వంద చదరపు మీటర్లకు రెండు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, రెండు స్మోక్ డిటెక్టర్లను ఉంచాలని, అగ్ని ప్రమాద సమయంలో ఫైర్ కంట్రోల్ రూం నం.8712699444, 101, ట్విట్టర్ ః @Telanganafireలో సంప్రదించాలని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.
అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు