హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బృందానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరా నగర్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాణానికి ముందు, నిర్మాణం తర్వాత భవనాల చిత్రాలను కేటీఆర్ ట్వీట్ చేస్తూ జీహెచ్ఎంసీ బృందాన్ని అభినందించారు.
ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో నిర్మించిన 210 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మెయిన్ సెంటర్లో పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇడ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో రూ.9714 కోట్లతో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడుతున్నామని చెప్పారు. మార్కెట్లో రూ.50 లక్షలు విలువ చేసే ఇల్లు ఉచితంగా ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఇండ్లు నిర్మిచడం లేదని చెప్పారు.
ఇందిరానగర్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఐదంతస్తుల్లో 5 బ్లాక్‌ల్లో నిర్మించారు. సీసీ రోడ్డు, తాగునీరు, 7 లిఫ్టులు, 7 షాపులు, డ్రైనేజీ కాలువ వంటి అన్ని మౌలిక వసతులను కల్పించారు. ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చని మొక్కలునాటి సుందరీకరణ పనులు చేపట్టారు.
Before & After pics of the 2BHK houses built under the #DignityHousing program inaugurated today at Indira Nagar in Khairatabad constituency
My compliments to team @GHMCOnline 👍 pic.twitter.com/46FPIck8Oh
— KTR (@KTRTRS) February 3, 2022