హైదరాబాద్ : ఉప్పల్ చిలుకా నగర్ 7వ డివిజన్లో నిర్వహించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం టీడీపీ, సీపీఐఎం కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి బ్లాంకెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్థానిక కార్పోరేటర్లు, టీఆర్ెస్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.