బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
రవీంద్రభారతి, మే31: బీసీలు అన్ని రంగాలలో రాణించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వేసవి సాంస్కృతిక సంబురాల కార్యక్రమం మంగళవారం సాయంత్రరం రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, అబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ విచ్చేశారు.
అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలను స్థాపించారని చెప్పారు. అంతేకాకుండా బీసీ విద్యార్థులు విదేశాలలో చదువుటకు రూ. 25 లక్షలు ఇస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు కిశోర్‌గౌడ్, సీహెచ్ ఉపేందర్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
