కీసర, ఆగస్టు 8 : కోట్లాది రూపాయలతో మండలంలోని అన్ని గ్రామాల్లో అత్యధిక అభివృద్ధి పనులు చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండలంలోని అంకిరెడ్డిపల్లి, కీసరదాయర, వన్నిగూడ, భోగారం, కీసర తదితర గ్రామాల్లో మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర ద్వారా సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో స్థానిక సమస్యలపై మాట్లాడారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న గుడిసెల నిర్మాణాలు, కమ్యూనిటీహాల్స్ నిర్మాణాలను, ముస్లిం మసీదులను, ఖబరస్థాన్ ఫ్లోరింగ్, ప్రహరీల పనులను సొంత నిధులతో చేపడుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. కీసరలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.20లక్షలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అటు ప్రభుత్వ పరంగానే కాకుండా తను స్వచ్ఛందంగా కూడా అత్యధిక నిధులతో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిని పూర్తి చేయాలన్నదే తమ ప్రత్యేక ధ్యేయమన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, ఆయా గ్రామాల్లోని సర్పంచ్‌లు నాయకపు మాధురి వెంకటేశ్, మోర విమలనాగరాజు, ఎంపీటీసీలు తటాకం నారాయణ, పండుగ కవితశశికాంత్, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సింగారం నారాయణ, బీఆర్ఎస్ నేతలు నాయకపు వెంకటేశ్ ముదిరాజ్, రామిడి ప్రభాకర్‌రెడ్డి, తటాకం లక్ష్మణ్‌శర్మ, బి.రమేశ్‌గుప్త, ఎం.జంగయ్యయాదవ్, తటాకం భానుశర్మ, పంచాయతీ సభ్యులు, పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు, ఉప సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి మంత్రి విరాళం
బోడుప్పల్, ఆగస్టు 8 : బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని లక్ష్మారెడ్డి కాలనీలో పోచమ్మ ఆలయ నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి సొంత నిధులు రూ.5లక్షలు విరాళం ప్రకటించినట్లు కాలనీ నాయకుడు శివారెడ్డి తెలిపారు. అంతేగాకుండా మేయర్ బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి కాలనీ సమస్యలు వివరించడంతో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.
నేడు మంత్రి మల్లారెడ్డి రాక
మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 8 : నాగారం మున్సిపాలిటీకి ఈనెల 9న బుధవారం మంత్రి మల్లారెడ్డి విచ్చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి తెలిపారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారని, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు హాజరుకావాలని కోరారు.