ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 30: ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఓయూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ కోరింది. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఓయూ హాస్టళ్లు, మెస్‌లలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. 12 ఏండ్లు పూర్తి అయిన వారికి క్రమబద్ధీకరణ చేస్తూ అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, యూనియన్ నాయకులు మహేందర్, సీతారాం, శ్రీనివాస్, నాగరాజు, మహేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.