Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ మానసిక వికలాంగురాలిపై తండ్రీకుమారుడు కలిసి అత్యాచారం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. 23 ఏండ్ల వయసున్న ఓ యువతి(మానసిక వికలాంగురాలు) తన తల్లితో కలిసి నగర శివార్లలో నివసిస్తోంది. ఆమెకు తండ్రి లేడు. యువతి తల్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే తల్లి ఇంట్లో లేని సమయంలో మానసిక వికలాంగురాలైన కూతురిపై స్థానికంగా ఉండే ఓ వ్యక్తి, అతని కుమారుడు(మైనర్) కలిసి అత్యాచారం చేశారు. గత కొద్ది నెలలుగా ఈ దారుణానికి పాల్పడుతున్నారు.
ఇటీవలే బాధిత యువతి అస్వస్థతకు గురికాగా తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు టెస్టులు నిర్వహించగా, ఆమె నాలుగు నెలల గర్భిణి అని తేలింది. దీంతో జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పి యువతి బోరున విలపించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.