Mega Job Mela | హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. ఆగస్టు 2వ తేదీన నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు మెగా జాబ్ మేళా నిర్వాహకులు మన్నన్ ఖాన్ ఇంజినీర్ అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా జాబ్ మేళాలో అనేక కంపెనీలో పాల్గొననున్నాయని తెలిపారు. ఫార్మా, హెల్త్, ఐటీ, ఎడ్యుకేషన్, బ్యాంక్ సెక్టార్లతో పాటు వివిధ రంగాలకు చెందిన కంపెనీలు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నాయి. వీటిలో కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మెగా జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా పది, ఆపై తరగతులు ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. మెగా జాబ్ మేళాలో పాల్గొనదలచుకునే వారు మరిన్ని వివరాలకు 8374315052 నెంబర్లో సంప్రదించాలన్నారు.