e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home హైదరాబాద్‌ నెలలు నిండకుండా శిశువు జననం

నెలలు నిండకుండా శిశువు జననం

నెలలు నిండకుండా శిశువు జననం

కొండాపూర్ : నెలలు నిండకుండా జన్మించిన శిశువుకు హైటెక్‌ సిటీలోని మెడికవర్‌ వైద్యులు మెరుగైన వైద్యం అందించి ప్రా ణాలు కాపాడారు. 24 నెలల ఐదు రోజు ల (నాలుగు నెలల ముందు)కు తక్కువ బరువు (550గ్రాములు)తో జన్మించడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు వైద్యులు రవీందర్‌రెడ్డి తెలిపారు. శిశువు పుట్టిన వెంటనే వెంటిలేటర్‌ సహాయంతో శ్వాసను అందిస్తూ ఇంక్యూబేటర్‌లో ఎన్‌ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు. మూడు రోజుల తర్వాత ఇంక్యూబేటర్‌ నుంచి కంటిన్యూయస్‌ పాజిటివ్‌ ఎయిర్‌ వే ప్రెషర్‌ (సీపీఏపీ) ద్వారా కొన్ని వారాల పాటు శ్వాసను అందిస్తూ హై ఫ్లో నాసల్‌ కాన్యులాతో సొంతంగా శ్వాస తీసుకునేంత వరకు కొనసాగించినట్లు తెలిపారు. పుట్టిన రెండు రోజుల నుంచి ఐవీ ఫ్లూయిడ్స్‌, ఆంటీ బయోటిక్స్‌, బ్యూబ్‌ ద్వారా పాలు వంటివి అందింగా, శిశువుకి జీర్ణ వ్యవస్థలో ఇన్ఫెక్షన్‌ వచ్చింది. ఇన్ఫెక్షన్‌ నయమయిన తర్వాత, వెంటనే శిశువు నోటి ద్వారా ఆహారం తీసుకోవడం మొదలు పెట్టగా, ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని, బరువు 2.50 కేజీలకు పెరిగిందన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నెలలు నిండకుండా శిశువు జననం

ట్రెండింగ్‌

Advertisement