సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): భారతదేశపు అతిపెద్ద బీ2బీ మెడికల్ ఉపకరణాల ట్రేడ్ ఫెయిర్ అయిన మెడీకాల్ మార్చి 17 నుంచి 19 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహిస్తున్నది. మెడ్ ఎక్స్పర్ట్ బిజినెస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 32వ ఎడిషన్‌లో సర్జికల్ కాటన్ నుంచి అధునాతన ఇమేజింగ్ పరికరాలు, శస్త్ర చికిత్స ఉపకరణాల వరకు 10వేలకు పైగా ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.
300 మంది ఎగ్జిబిటర్లు పాల్గొనే ఈ ప్రదర్శనలో సెమినార్లు, వర్క్‌షాప్స్, కాన్ఫరెన్స్లతోపాటు దవాఖానల నిర్వహణకు సంబంధించిన వ్యాపార పరిజ్ఞానం పెంపొందింపజేసేందుకు అవసరమైన అంశాలపై చర్చించనున్నారు. వివిధ వైద్య పరికరాల తయారీదారులను ఒకే గొడుగు కిందకు చేర్చేందుకు ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు మెడీకాల్ వ్యవస్థాపకుడు, సీఈవో ఎస్.మణివణ్ణన్ పేర్కొన్నారు.