మేడ్చల్, డిసెంబర్3(నమస్తే తెలంగాణ):మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజ లు బీఆర్ఎస్ అభ్యర్థులకే పట్టం కట్టారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్ప ల్ నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులు సమీప ప్రత్యర్థులపై విజయం సాధిం చి క్వీన్ స్లీప్ చేశారు. ఐదు నియోజకవర్గాలలో అన్ని రౌండ్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు అధిపత్యం చూయించారు. జిల్లాలో మేడ్చల్ అభ్యర్థి మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి, కుత్బుల్లాపూర్ అభ్యర్థి కేపీ. వివేకానంద్, కూకట్పల్లి అభ్యర్థి మాదవరం కృష్ఱారావు, ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయం సాధించారు.
ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీగా మెజార్టీలతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. మేడ్చల్ అభ్యర్థి మంత్రి మల్లారెడ్డి రెండవ సారి ఎమ్మెల్యేగా గెలుపొందగా కుత్బుల్లాపూర్, కూకట్పల్లి అభ్యర్థులు కేపీ. వివేకానంద్, మాధవరం కృష్ణారావు మూడోసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందగా మొదటి సారి మల్కాజిగిరి, ఉప్పల్ అభ్యర్థులు మర్రి రాజశేఖర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డిలు మొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు.
జిల్లాలోని ఐదుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులలో అత్యధిక మెజార్టీతో కుత్బుల్లాపూర్ అభ్యర్థి కేపీ. వివేకానంద్ 85 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. దీంతో జిల్లా అంతటా సంబురాలు చేసుకున్నారు. గెలుపొందిన అభ్యర్థులును నాయకులు, కార్యకర్తలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.