నకిలీ పాస్‌పోర్టు కేసులో..
నకిలీ పాస్‌పోర్టు కేసులో మీసేవ యజమాని కొప్పిశెట్టి కళ్యాణ్, మారేడ్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న తిప్పన్న, పంజాగుట్ట ట్రాఫిక్ ఏఎస్ఐ షేక్నజీర్ భాషా, వెంకటేశ్వర్లుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. మంగళవారం 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
- ముగ్గురు ఏఎస్ఐలకు బెయిల్ మంజూరు
నాంపల్లి కోర్టులు, మార్చి 12 (నమస్తే తెలంగాణ): నకిలీ పాస్‌పోర్టు కేసులో మీసేవ యజమాని కొప్పిశెట్టి కళ్యాణ్, మారేడ్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న తిప్పన్న, పంజాగుట్ట ట్రాఫిక్ ఏఎస్ఐ షేక్నజీర్ భాషా, వెంకటేశ్వర్లుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. మంగళవారం 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.15వేల చొప్పున ఇద్దరి పూచీకత్తును జమానత్‌గా కోర్టుకు సమర్పించాలని, ప్రతి శుక్రవారం సీఐడీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. కస్టడీలో నలుగురు నిందితులు తెలిపిన వివరాల ప్రకారం.. అధికారులు చెన్నైకు పయనమయ్యారు. ఈ కేసుతో సంబంధమున్న మరికొందరిని అదుపులోకి తీసుకోనున్నారు.
ప్రధాన నిందితుడు సత్తార్‌తో ఏర్పడిన పరిచయాల వల్ల శ్రీలంక జాతీయులకు భారత పాస్‌పోర్టులను తయారు చేసి విదేశాలకు పంపించారు. పాస్‌పోర్టులను రూపొందించేందుకు నకిలీ పత్రాలను, నకిలీ చిరునామాలతో నకిలీ సర్టిఫికెట్లను తయారు చేశారు. నకిలీ పాస్‌పోర్టులను పొందిన 100 మంది శ్రీలంకకు చెందిన వారు విదేశాల్లో ఉన్నారు. వారందరి జాబితాను సేకరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 23వ నిందితుడి వరకు అందరూ బెయిల్‌పై విడుదలయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

