Fire Accident | కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం.. తుక్కు గోదాంలో ఎగసిపడిన మంటలు
హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ తుక్కు గోదాంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆదివారం రాత్రి 9.30 గంటల తర్వాత గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
హైదరాబాద్: హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ తుక్కు గోదాంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆదివారం రాత్రి 9.30 గంటల తర్వాత గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో గోదాం చుట్టు పక్కల ఉన్న నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తున్నది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు గోదాం నిర్వాహకులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

