బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని..
సొంత ఆస్తులు, స్థలాలపై బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని నమ్మించి, ఆ సేల్ డీడ్ కాగితాలను మూడో వ్యక్తికి బదిలీ చేసి కోట్లాది రూపాయల మేర ఘరానా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన యుగంధర్ కాగా 2016 నుంచి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో 20కి పైగా క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
- 30 మందిని మోసం చేసి రూ.10 కోట్ల ఎగవేత అరెస్ట్ చేసిన పోలీసులు
సిటీబ్యూరో, ఆగస్ట్ 15 (నమస్తే తెలంగాణ): సొంత ఆస్తులు, స్థలాలపై బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని నమ్మించి, ఆ సేల్ డీడ్ కాగితాలను మూడో వ్యక్తికి బదిలీ చేసి కోట్లాది రూపాయల మేర ఘరానా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన యుగంధర్ కాగా 2016 నుంచి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో 20కి పైగా క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల విచారణలో యుగంధర్ వేర్వేరు వ్యక్తులకు సంబంధించిన ఆస్తులపై రుణాలు ఇప్పిస్తానంటూ నమ్మించి ఇప్పటివరకు రూ.10కోట్లకు పైగా మోసం చేసినట్లు తేలిందని చెప్పారు. యుగంధర్ పై ఫిర్యాదు చేసిన వ్యక్తికి అతను రూ.60 లక్షల ఆర్థిక సాయం అందించిన నిందితుడు ఆ ఆస్తిని వేరొకరికి విక్రయించనని ఒప్పందం చేసుకుని సేల్‌డీడ్ రాయించుకున్నారు.
అయితే ఫిర్యాదుదారునికి తెలియకుండానే ఆ సేల్‌డీడ్‌ను దుర్వినియోగం చేస్తూ ఆ ఆస్తిని మూడో వ్యక్తి పేరిట మార్చేశాడు. ఆ తర్వాత ఆ ఆస్తిని కుదువబెట్టి యాక్సిస్ బ్యాంక్ నుంచి సుమారు రూ.1.50కోట్ల రుణం పొంది, డిఫాల్ట్ అయ్యాడు. బ్యాంక్ అధికారులు రుణం చెల్లించాలని ఫిర్యాదుదారునికి నోటీసులు పంపడంతో నిందితుడి మోసం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు అందిన తర్వాత సీసీఎస్ డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ కిరణ్, ఎస్ఐ అనిల్‌కుమార్ నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రోడ్డు మీదికి 3వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

