మేడ్చల్, జూలై 24 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరికి మంజూరైన సీటీ స్కాన్ యంత్రాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అదనపు కలెక్టర్ ఫైజాన్ ఆహ్మద్‌తో సమావేశమయ్యారు. పలు సమస్యలు పరిష్కరించాలని ఫైజాన్ అహ్మద్‌కు వినతిపత్రం అందించారు. వీటన్నింటి పరిశీలించి చర్యలు తీసుకుంటానని అదనపు కలెక్టర్ పైజాన్ ఆహ్మద్ తెలిపారు. ఈ సమావేశంలో వైద్యాధికారి ఆనంద్, డాక్టర్ రాధా, డాక్టర్ మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.