Covid Vaccine | కొవిడ్ టీకాతో అనేక దుష్ప్రభావాలు
కొవిడ్‌తో పాటు ఇతర టీకాలు బలవంతంగా ప్రజలకు వేయడం రాజ్యాంగ వ్యతిరేకమని ఆవేకెన్ మూవ్మెంట్ ఇండియా ఆరోపిస్తున్నది.
- 99 మిలియన్ల మందిపై ప్రభావం
- బాధితుల వివరాలను ప్రభుత్వం సేకరించాలి
- బలవంతపు టీకా రాజ్యాంగ వ్యతిరేకం
- ఆవేకెన్ మూవ్మెంట్ ఇండియా
Covid Vaccine | ఖైరతాబాద్, ఏప్రిల్ 1 : కొవిడ్‌తో పాటు ఇతర టీకాలు బలవంతంగా ప్రజలకు వేయడం రాజ్యాంగ వ్యతిరేకమని ఆవేకెన్ మూవ్మెంట్ ఇండియా ఆరోపిస్తున్నది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రతినిధులు డాక్టర్ ప్రవీణ్ సక్సెనా, ప్రొఫెసర్ భాస్కర్ రామన్, సరస్వతి కవుల, డాక్టర్ సుధా చెప్యాల మాట్లాడుతూ ఒక టీకా వేయాలంటే అన్ని రకాల ట్రయల్స్ పూర్తి చేసుకొని సురక్షితమైనదని నిర్ధారించిన తర్వాతే వేయాల్సి ఉంటుందన్నారు. కొవిడ్ టీకాను పూర్తి స్థాయిలో నిర్ధారించుకోకముందే కోట్లాది మందికి వేశారని అన్నారు.
ఫలితంగా అనేక దుష్ప్రభావాలు వస్తున్నాయని, 99 మిలియన్ల మందికి ఈ ప్రభావం చూపినట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. కొవిడ్ టీకాల దుష్ప్రభావాల బాధితుల వివరాలను సైతం సేకరించడం లేదని, దీని కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రభుత్వం రూపొందించాలన్నారు. అలాగే చిన్నారులకు సైతం ఇష్టారీతిలో టీకాలు వేయిస్తున్నారని, వాటికి ప్రామాణికత ఉందా లేదా అనే తెలుసుకోవాలని, ఇలాంటి వ్యాక్సినేషన్ వల్ల ఆటిజం, ఇతర జన్యు సంబంధిత వ్యాధులు కలుగుతున్నాయన్నారు. కొన్ని సంస్థలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే మార్కెట్లోకి టీకాలను తీసుకువస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

