బుధవారం 23 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 00:32:27

లయన్స్‌ డేపై విద్యార్థులకు పలు పోటీలు

లయన్స్‌ డేపై విద్యార్థులకు పలు పోటీలు

చార్మినార్‌: అంతర్జాతీయ లయన్స్‌ డేను పురస్కరించుకుని సోమవారం నగరంలోని జూపార్క్‌ అధికారులు లైఫ్‌ ఆఫ్‌ లయన్స్‌ అనే అంశంపై నర్సరీ నుంచి 5వ తరగతి విద్యార్థులకు డ్రాయింగ్‌, 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పెయింటింగ్‌లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నట్లు జూపార్క్‌ క్యూరేటర్‌ క్షితిజా తెలిపారు. ఈ సందర్భంగా క్షితిజా మాట్లాడుతూ ప్రస్తుతం జూపార్క్‌లో 12 భారత సంతతికి చెందిన ఆసియాటిక్‌ సింహాలతోపాటు మరో 8 ఆఫ్రికన్‌ సింహాలు ఉన్నట్లు తెలిపారు.సింహాల రక్షణ కోసం పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నామని తెలిపారు. సింహాల అవశ్యకతను తెలియజేస్తూ క్షితిజా లఘు చిత్రాన్ని విడుదల చేశారు.

గజరాజుల దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌ పోటీలు 

చార్మినార్‌: అంతర్జాతీయ గజరాజుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని జూ పార్క్‌ క్యూరేటర్‌ క్షితిజా తెలిపారు. ఈ సందర్భంగా నర్సరీ నుంచి 5వ తరగతి విద్యార్థులకు డ్రాయింగ్‌ పోటీలు, 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. డ్రాయింగ్‌ పోటీలో పాల్గొన్న విద్యార్థులు కార్టూన్‌, డ్రాయింగ్‌లను పీడీఎఫ్‌, జేపీజీ ఫార్మట్‌లో 12వ తేది సాయంత్రంలోపు awarnesnehruzoologicalpark @gmail.comకు చేరవేయాలని సూచించారు. మరింత సమచారం కోసం www.neh ruzoopark.in, Twitter: @nehru zoopark1 for updates and results, 9885257246లో సంప్రదించాలని తెలిపారు.logo