కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే.. సైబర్ దొంగల దోపిడీ
పంపిన డబ్బు చేరక పోవడంతో.. డబ్బు రీఫండ్ కోసం కస్టమర్ కేర్‌ను అభ్యర్థించిన ఓ యువకుడి ఖాతా నుంచి సైబర్ చోరులు నగదు కాజేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు
వెంగళరావునగర్, సెప్టెంబర్ 28: పంపిన డబ్బు చేరక పోవడంతో.. డబ్బు రీఫండ్ కోసం కస్టమర్ కేర్‌ను అభ్యర్థించిన ఓ యువకుడి ఖాతా నుంచి సైబర్ చోరులు నగదు కాజేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. ఎల్లారెడ్డిగూడలోని హాస్టల్లో ఉంటున్న యు.శ్రీనివాసరావు తన క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపాడు. అయితే, షాపు యజమానికి నగదు చేరలేదు. దీంతో నగదు రీఫండ్ చేయమని అభ్యర్థించడం కోసం శ్రీనివాసరావు ఆన్లైన్లో వెతికి గూగుల్ (నకిలీ) కస్టమర్ కేర్ నంబర్‌ను సంప్రదించాడు.
సైబర్ చోరులు ఓ లింకును పంపి.. క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేయమన్నారు. వివరాలు నమోదు చేసిన శ్రీనివాస్‌రావు అనంతరం ఓటీపీని కూడా చెప్పాడు. ఓటీపీ చెప్పగానే క్రెడిట్ కార్డు ఖాతా నుంచి రూ.95 వేలు గల్లంతయ్యాయి. మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించిన బాధితుడు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

