హైదరాబాద్ : నగరంలోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుంట్లూరు నుంచి గోరెల్లి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన కుంట్లూరు శ్రీరామ్నగర్కు చెందిన కార్తీక్ అనే వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అయితే, మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండడంతో పాటు సంఘటనా స్థలంలో బైక్ నుజ్జునుజ్జ అయి పడిపోయింది. దీంతో మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.