హైదరాబాద్: శంషాబాద్ ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం రోడ్డుపై నడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అతడు కారు అద్దంలో ఇరుక్కుపోయాడు. అయితే కారును ఆపకుండా అలాగే కొంత దూరం లాక్కొనిపోవడంతో.. అతని తల తెగి వెనుక సీట్లో పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతుడిని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉట్పల్లికి చెందిన తోట్ల అంజయ్యగా గుర్తించారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.