దుండిగల్, మే 27: ఓ వ్యక్తి వర్షం నీటిలో మునిగి మృతి చెందిన ఘటన సూరారం కాలనీలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీకి చెందిన పద్మారావు (40) తల్లి కృష్ణవేణితో నివాసముంటున్నాడు.
మంగళవారం సాయంత్రం వర్షం కురవడంతో ఇంట్లో తన గదిలో పద్మారావు పడుకోగా ఇల్లు లోతట్టు ప్రాంతంలో ఉండటంతో గదిలోకి వాన నీళ్లు వచ్చి చేరాయి. గమనించిన తల్లి పద్మారావును లేపేందుకు ప్రయత్నించగా స్పందించక పోవడంతో వర్షంలోనే మునిగిపోయాడు. అంబులెన్స్ కు ఫోన్ చేయగా సిబ్బంది పరీక్షించి అప్పటికే పద్మారావు మృతి చెందినట్లు తెలిపారు. సీఐ భరత్ కుమార్ ను వివరణ కోరగా పద్మారావు నీట మునిగి మరణించినట్లు తెలిపారు.