హైదరాబాద్ : ఉప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిలుకానగర్లో ఎన్ఎస్ స్కూల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టిప్పర్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి టిప్పర్ వెనుక టైర్ కింద పడటంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి నాచారం వాసి విశాల్సింగ్(25)గా గుర్తించారు. సీసీటీవీ కెమెరాలో ప్రమాదం దృశ్యాలు రికార్డయ్యాయి.