హైదరాబాద్: ఆర్థిక సమస్యలు అంతడిని వెంటాడుతున్నాయి. డబ్బుకోసం చేసిన ఏ ప్రయత్నమూ ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తీవ్ర నిరాశచెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో (Hussain sagar) దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించి అతడిని కాపాడారు. చికిత్స కోసం దవాఖానకు తరలించారు. అతడిని బోయినపల్లికి చెందిన షేక్ ఫిరోజ్‌గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో సాగర్‌లోకి దూకినట్లు ఫిరోజ్ వెల్లడించారు.