మేడ్చల్, మే18(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్శితులై కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసలు మొదలయ్యాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోయిన్‌పల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల యూత్ లీడర్ పి.సంతోష్‌రెడ్డి, పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు ఆర్.వెంకటేశ్, ఉద్దెమర్రి వెంకటేశ్, కె.రాజశేఖర్, ఎం.దామోదర్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అభినయ్‌రెడ్డి, భరత్‌రెడ్డి, ఎల్లేశ్, వెంకటేశ్, ఎల్.నవీన్, కె.శ్రవణ్, తదితరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా మంత్రి మల్లారెడ్డి పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఖాళీలు కావడం ఖాయమన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలందరికీ ఇంటి పార్టీగా మారిందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. పథకాలను గడప గడపకు తీసుకెళ్లి పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, గ్రామ అధ్యక్షుడు దుర్గం వెంకటేశ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, డైరెక్టర్ భిక్షపతి, పార్టీ మాజీ అధ్యక్షుడు విష్ణుగౌడ్, దత్తుగౌడ్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.