రాంగ్‌రూట్ డ్రైవింగ్ డేంజర్
రాంగ్ సైడ్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరగడంతో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు, రాంగ్‌సైడ్ డ్రైవింగ్ వారానికి పదివేలకుపైగా కేసులు నమోదు చేస్తున్నారు.
- వారానికి పదివేలకుపైగా కేసులు
- ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ ఫోకస్
- నిబంధనల ఉల్లంఘనలపై సీరియస్
సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాంగ్ సైడ్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరగడంతో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు, రాంగ్‌సైడ్ డ్రైవింగ్ వారానికి పదివేలకుపైగా కేసులు నమోదు చేస్తున్నారు. ఎందుకు ఈ సమస్య వస్తుంది, సమస్యకు మూలాలు ఎక్కడ అనే విషయంపై మాత్రం పోలీసులు ఫోకస్ పెట్టకపోవడం ఆందోళన కల్గిస్తోందంటూ వాహనదారులు వాపోతున్నారు. జరిమనాలు వేయడం ద్వారానే సమస్య పరిష్కారం కాదనే విషయాన్ని పోలీసులు పట్టించుకోవడం లేదని, దీంతోనే కాలనీలు, బస్తీలు తేడా లేకుండా కేసులు రాస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. చాలా ప్రాంతాల్లో యూ టర్న్‌లు తీసుకొని రోడ్డు దాటాలంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందని, పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లాలన్నా కిలోమీటర్ల మేర తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇంధనం ధరలు ఆకాశానంటడం, కొన్ని పశ్చిమాసియా యుద్దంతో ఇంధనం కూడా అప్పుడప్పుడు దొరకని పరిస్థితుల్లో ఆందోళన మొదలవుతుందని, దీంతోనే తప్పని పరిస్థితుల్లో రాంగ్‌సైడ్ డ్రైవ్ చేయాల్సి వస్తోందంటూ వాహనదారులు తమ అభిప్రాయాలు చెబుతున్నారు.
ప్రాణాలకే ప్రమాదం..
కారణాలు చెబుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే అది ప్రాణాలపైకి వచ్చే అవకాశాలున్నాయి. రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌లో ఉల్లంఘనకు పాల్పడిన వారితో పాటు సాఫీగా అన్ని నిబంధనలు పాటిస్తూ ఎదురుగా వచ్చే వాహనదారుడికి సైతం ప్రమాదం పొంచి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవసరం అందరికీ ఉందని, తమ వ్యక్తిగత అభిప్రాయాలకు, ట్రాఫిక్ నిబంధనలకు ముడిపెట్టవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి వారం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా ఉల్లంఘనలు నమోదవుతున్నాయి.
మూడు వారాల్లో నమోదైన కేసులు
19వ తేదీ నుంచి 25 – 11673
12వ తేదీ నుంచి 18 -10260
5వ తేదీ నుంచి 11 -10420
మైనర్ డ్రైవింగ్‌పై కొరడా..
ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇటీవల 780 కేసులు నమోదు చేశారు. అందులో ఇద్దరు మైనర్లు కూడా ఉ ండడంతో వారిపై చార్జిషీట్ కోర్టులో దాఖలు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదని, రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌లో కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూడొద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, అనధికారిక సైరన్లు, అతిగా శబ్దం చేసే హారన్ల విషయంలోను ఫోకస్ పెట్టామని మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

