మేడ్చల్ /శామీర్‌పేట, జనవరి 23 : ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కంటి వెలుగు కోసం రూ.250 కోట్లు నిధులు వెచ్చించారన్నారు. 100 రోజుల కార్యక్రమంలో కంటి పరీక్షలతో 30లక్షల అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 1500బృందాలు, పల్లెలు, పట్టణాల్లో పర్యటించి కంటి పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ఎంపీ పీ ఎల్లుబాయిబాబు, జడ్పీటీసీ అనితాలాలయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జహీరుద్దీన్, వైస్ ఎంపీపీ సుజాత తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, సర్పంచ్‌లు కుమార్ యాదవ్, భాస్కర్, కృపాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, డైరెక్టర్లు, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్కేసర్, మూడుచింతపల్లి మండలాలు, పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్ కార్పొరేషన్లతో పాటు ఏడు మున్సిపాలిటీల్లో 18 కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో సోమవారం 2332 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 727 మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వగా, 382 మందికి శస్త్ర చికిత్సలను అవసరమని గుర్తించారు. మరో 311 మందికి కంటి అద్దాలను 15రోజుల్లో ఇవ్వనున్నారు.
కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలను ఉచితంగా ఇవ్వ డం చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు పేదలందరు రుణపడి ఉంటారు. కంటి సమస్యతో చాలా రోజులుగా బాధపడుతున్నాను. రూపాయి ఖర్చులేకుండా కంటి పరీక్ష చేశారు. -మాదిరెడ్డి సంజీవరెడ్డి, కీసర ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదుపుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సీఎంను చూడలేదు. పేదల కోసం కేసీఆర్ ఎంతో చేస్తుండు. ఊరికే వచ్చి, కంటి పరీక్ష చేసి, ఉచితంగా అద్దాలు ఇస్తున్నాడు. నిరుపేదలను గతంలో ఎవరూ కూడా ఇలా ఆదుకోలేదు. ఆయనను దేవుడు. పది కాలాల పాటు సల్లంగా సూడాలి. -మైసయ్య, కీసర