హైదరాబాద్ : నాంపల్లి( Nampally) లోని చీరక్గల్లి లైన్లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం(Major Fire) చోటు చేసుకుంది. ఓ ఫర్నీచర్ దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ముందుగా ఫర్నిచర్ షాప్‌లోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదలైన మంటలు నాలుగో అంతస్తు వరకు పాకాయి. ఈ భవనంలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 4ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.