Maheshwaram | కందుకూరు, జూన్ 4 : మహేశ్వరం ఆర్టీసీ బస్సు డిపో మహాసభలను విజయవంతం చేయాలని మండల సిఐటియు కార్యదర్శి బుట్టి బాలరాజ్ కోరారు. ఈనెల 13వ తేదీన జరిగే ఎస్‌డబ్ల్యూఎఫ్ మహాసభలను జయప్రదం చేయడానికి సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పాషా నరహరి ఆఫీసులో ఎస్‌డబ్ల్యూఎఫ్ మహేశ్వరం డిపో కన్వీనర్ సాయిలు, అధ్యక్షతన సన్నాక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎస్‌డబ్ల్యూఎఫ్ హైదరాబాద్ రివిజనల్ కార్యదర్శి సాధురి కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కృష్ణతో కలిసి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పేర్కొన్నారు. మహాసబకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కార్మికులపై పనిభారాన్ని మోపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీని ప్రైవేటీకరించడంలో నిమగ్నమై ఉన్నారని వారు విమర్శించారు. కార్మికులు సంఘటితంగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈజీ ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ మహేశ్వరం డిపో నాయకులు మేకల జంగయ్య, వర్కిటి కృష్ణ నరసింహ పాల్గొన్నారు.