హైదరాబాద్ : బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబాఫూలే అని పలువురు అన్నారు. ఫూలే జయంతి సందర్భంగా నగరంలో వివిధ ప్రజా సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫూలే చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.స్త్రీ విద్య, సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు ఫూలే అన్నారు. అలాగే వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే అని ఆయన సేవలను కొనియాడారు. ఫూలే జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
గుడిమల్కాపూర్ డివిజన్ శారద నగర్ చౌరస్తాలోని జ్యోతి బాబు కార్వాన్ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కార్వాన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో..