చార్మినార్, జూలై 18 : బోనాల ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారికి వివిధ దేవాలయాల్లో విశిష్ట పూజాధి కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున మహంకాళి అమ్మవారికి అభిషేకం నిర్వహించిన వేద పండితులు అనంతరం మహా నైవేద్యాన్ని, మహా హారతి అందించారు. విశిష్ట పూజల అనంతరం మహిళా భక్తులచే లలిత దేవి అమ్మ వారి సహస్రణామార్చన, లక్ష కుంకుమర్చన కార్యక్రమాలను నిర్వహించారు.
డీసీపీ పూజలు
ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో దక్షణ మండల డీసీపీ స్నేహ మెహ్రా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు జనగామ మధుసూదన్ గౌడ్ డీసీపీ కి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.