బంజారాహిల్స్, అక్టోబర్ 5: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే కుటుంబసభ్యులుగా భావించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా పనిచేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ అన్నారు. ఆదివారం బోరబండ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వంటావార్పూ కార్యక్రమంలో పాల్గొన్న మాగంటి సునీతా గోపీనాథ్ మాట్లాడుతూ..
జీవితాంతం ప్రజల కోసమే పనిచేసిన ప్రజానాయకుడు గోపీనాథ్ ఆశయాలను కొనసాగించే బాధ్యత తనతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో మాగంటి కుమార్తె దిశిర, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణమోహన్, సీనియర్ నేత విజయ్‌కుమార్, ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.