హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపట్ల బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం అందరూ పనిచేయాలని, అధికార పార్టీకి అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యం చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు బూత్‌లలో యధేచ్చగా తీరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అధికార పార్టీ నాయకులు రౌడీయిజం చేస్తున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారన్నారు. 13వ తేదీ వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండని, 14వ తేదీ తర్వాత చూసుకుందామన్నారు. బోరబండలో రౌడీ షీటర్ ప్రజలను బెదిరిస్తుంటే అతనికి సహకరిస్తారా అని ఫైర్ అయ్యారు. ఆశా వర్కర్లు తమకు ఓటు వేయకపోతే ఉద్యోగం తీసేస్తామని అంటున్నారని, ఇదేం రౌడీయిజమని ప్రశ్నించారు.
ఎన్నికల కోడ్‌ను లెక్కచేయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సిద్దార్థ నగర్ బూత్-120 వద్ద యధేచ్చగా కాన్వాయ్‌లో తిరుగుతున్న భట్టి విక్రమార్క https://t.co/A7G3Yeqvut pic.twitter.com/PAjwCc6UkD
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025
మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు. సిద్దార్థ నగర్ బూత్-120 వద్ద భారీ కాన్వాయ్‌తో పర్యటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎలా సహకరిస్తారని పోలీసులపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బోరబండలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు, బలవంతంగా ఆమెను వెనక్కి పంపించారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఏంటి అంటూ అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. బోరబండలో సీఐ కూడా కాంగ్రెస్ నాయకులకు సపోర్ట్ చేస్తున్నారన్నారు. తాము పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుంటే పోలీసులు మమ్మల్ని వీడియోలు తీస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి పోలీసులు వారికి సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
13వ తేదీ వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, 14వ తేదీ తర్వాత చూసుకుందాం
బోరబండలో రౌడీ షీటర్ ప్రజలను బెదిరిస్తుంటే పోలీసులు అతనికి సహకరిస్తారా?
ఆశా వర్కర్లు మాకు ఓటు వేయకపోతే మీ ఉద్యోగం తీసేస్తాం అంటున్నారు, ఇదేం రౌడీయిజం? –మాగంటి సునీత pic.twitter.com/enPE5f9KgK
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025
అభ్యర్థికి పోలింగ్ కేంద్రాలు తిరిగే హక్కు లేదా.. ఇదెక్కడి దౌర్జన్యం!
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను అడ్డుకొని, బలవంతంగా వెనక్కి పంపిస్తున్న పోలీసులు
ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఏంటి అంటూ మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు
పోలీసుల… pic.twitter.com/2Bhnam1CSP
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025