జూబ్లీహిల్స్, అక్టోబర్ 18 : యూసుఫ్‌గూడలో మా గంటి మహిళా సైన్యం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దివంగత ఎ మ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించేవారు.. మహిళల పై ప్రత్యేక ఆదరాభిమానాలు చూపిస్తూ ప్రతి పండుగకు వారికి బహుమానాలు ఇచ్చేవారు.. దీంతో ప్రతి ఇంట్లో మా ఇంటి మాగంటి అని పిలుచుకునేవారని గుర్తుచేశారు. శనివారం శ్రీకృష్ణానగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ ప్రచారంలో పెద్ద ఎత్తున మహిళలు చుట్టుముట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.