Radical Islamic Activists | ఇస్లామిక్ రాడికల్స్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్
ఇస్లామిక్ రాడికల్స్ కేసులో (Radical Islamism) పరారీలో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌లోని బాలాజీనగర్‌కు చెందిన సల్మాన్‌ను మధ్యప్రదేశ్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (Madhyapradesh ATS squad) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: ఇస్లామిక్ రాడికల్స్ కేసులో (Radical Islamism) పరారీలో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌లోని బాలాజీనగర్‌కు చెందిన సల్మాన్‌ను మధ్యప్రదేశ్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (Madhyapradesh ATS squad) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌తోపాటు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కేంద్రంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న 16 మంది రాడికల్ ఇస్లామిస్ట్ (హిజ్బ్-ఉద్-తహ్రీర్) కార్యకర్తలను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిలో 11 మందిని భోపాల్‌లోని బాగ్ ఉమ్రావ్ దుల్హా, జవహర్‌కాలనీ, బాగ్ ఫర్హత్ ఆఫ్జా, చింద్వారా ప్రాంతాల్లో, మరో ఐదుగురిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ భోపాల్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు సల్మాన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం ఆరుగురిని ఏటీఎస్ పోలీసులు అరెస్టుచేసినట్లయింది.
కాగా, నిందితులు హైదరాబాద్‌లో 18 నెలలుగా ఎవరికీ అనుమానం రాకుండా రాడికల్ ఇస్లామిక్ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించారు. వీళ్లను ప్రశ్నించడం ద్వారా ఏదైనా కుట్ర పన్నారా? తదితర వివరాలు బయటపడతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
నిందితుల్లో మెడికల్ కాలేజీ హెచ్‌వోడీ
హైదరాబాద్‌లో అరెస్టయిన ఐదుగురిలో ముగ్గురు ఉన్నత హోదాల్లో ఉన్నారు. వీరిలో భోపాల్‌కు చెందిన మహ్మద్ సలీమ్ హైదరాబాద్‌లోని ఓ మెడికల్ కాలేజీలో హెచ్వోడీగా పనిచేస్తున్నాడు. ఒడిశాకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ ప్రముఖ ఎమ్మెన్సీ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్‌గా, షేక్ జునైద్ పాతబస్తీలో డెంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. వీరితోపాటు అబ్బాస్ అలీ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. జగద్గిరిగుట్టకు చెందిన మహ్మద్ హమీద్ రోజువారీ కూలి. శామీర్‌పేటకు చెందిన మహమ్మద్ సల్మాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. భోపాల్‌లో అరెస్టయిన మహమ్మద్ వసీమ్ ఓ ఎన్జీవోలో పనిచేస్తున్నట్టు గుర్తించారు. అతని తండ్రి భోపాల్ గ్యాస్ బాధితుల కోసం పనిచేశారని పోలీసులు చెప్తున్నారు.
ఐఎస్ఐఎస్ కంటే ప్రమాదకారి!
ఉగ్రవాద భావజాలాన్ని తీవ్రస్థాయిలో వ్యాప్తి చేస్తున్న ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా-ISIS) కంటే హిజ్బ్-ఉత్-తహ్రీర్ సంస్థ ప్రమాదకరమైన ఉగ్రవాద సమూహంగా మారింది. ఈ సంస్థకు 50 దేశాల్లో మద్దతు ఉన్నది. విదేశాల్లో ఈ సంస్థకు ప్రత్యేక సాయుధ విభాగం ఉన్నది. వీరు రసాయన, బ్యాక్టీరియా, జీవ సంబంధమైన యుద్ధంలో తన కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం 1952లో ఈ సంస్థను స్థాపించారు. లండన్‌లో దీనికి ప్రధాన కార్యాలయం ఉన్నది. ఈ సంస్థ యూరప్, మధ్యఆసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియాలో ప్రత్యేకించి ఇండోనేషియాలో శాఖలను కలిగి ఉన్నది. ఆయా ప్రాంతాల్లో ఇది గొప్ప ప్రభావాన్ని చూపెడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

