Madhu Goud Yaskhi | మన్సురాబాద్ : స్వాతి రెసిడెన్సి వద్ద అసంపూర్తిగా నిలిచిపోయిన డ్రైనేజీ ట్రంక్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ హామీ ఇచ్చారు. డ్రైనేజీ ట్రంక్ లైన్ పనులు నత్త నడకన నడుస్తున్న నేపథ్యంలో కాలనీలవాసుల ఆహ్వానం మేరకు బుధవారం మన్సురాబాద్ డివిజన్ పరిధి స్వాతి రెసిడెన్సి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి, పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రంక్ లైన్ పనులు నెలల తరబడిగా నడుస్తుండడంతో ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.
పనుల ఆలస్యంపై అక్కడికి వచ్చిన డీజీఎం మాధవిని ప్రశ్నించారు. పనుల ఆలస్యానికి ఏవైనా కారణాలు ఉంటే.. తన దృష్టికి తీసుకురావాలని వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. వర్షాకాలంలోపు యూజీడీ ట్రంక్లైన్ పనులు పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట టీపీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, మన్సురాబాద్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుడ్డ సత్యనారాయణ, నాయకులు చెన్నగొని రవీందర్, శ్రీపాల్ రెడ్డి, కుట్ల నర్సింహా యాదవ్, లింగాల కిశోర్ గౌడ్, వేణుగోపాల్ యాదవ్, సదాశివుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, భీమిడి రామకృష్ణారెడ్డి, మహేందర్ యాదవ్ పాల్గొన్నారు.