మాదాపూర్, అక్టోబర్ 9: దసరా పండుగ వేళ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో అటు వినియోగదారులను ఇటు పాఠకులను ఉషారెత్తించేందుకు దసరా బొనాంజాతో బంపర్ డ్రాను ప్రవేశపెట్టింది. వారం రోజులుగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వహిస్తున్న దసరా బొనాంజా ధమాకా వినియోగదారులకు మరింత చేరువవుతూ దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో బుధవారం కొండాపూర్‌లోని హర్ష టయోటా షోరూం స్పాన్సర్‌గా ఏర్పాటు చేసిన లక్కీ డ్రా బొనాంజాలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే జనరల్ మేనేజర్ ఎన్. సురేందర్ రావు, మేనేజర్ శ్రీ చరణ్ ఆనంద్, ఏజీఎం రాజిరెడ్డిలతో పాటు హర్ష టయోటా గ్రూప్ సీఈఓ టీఎస్ ప్రకార్తీక్, వైస్ ప్రెసిడెంట్ సేల్స్ ప్రశాంత్ పాములపర్తి, మార్కెటింగ్ హెడ్ సుమన్ బెనర్జీలు హాజరై వీరి సమక్షంలో లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా కేఎల్ఎమ్ ఫ్యాషన్ మాల్, గిఫ్ట్ స్పాన్సర్‌గా బిగ్ సీ, ఆల్మండ్ హౌస్ భాగస్వామ్యం అందించాయి. ప్రచారకర్తగా టీ న్యూస్, డిజిటల్ ప్రచార కర్తగా సుమన్ టీవీలు వ్యవహరిస్తున్నాయి. ఇందులో మొదటి బహుమతి రమణ 32 ఇంచుల టీవి గెలుచుకోగా ద్వితీయ బహుమతి రమ్య శ్రీ స్మార్ట్ ఫోన్, తృతీయ బహుమతి యశస్ రాజ్‌లు గిఫ్ట్ వోచర్‌ను గెలుచుకున్నారు.