బోడ్పుప్పల్, అక్టోబర్28: అభివృద్ధి చేసి చూపిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరుగులేని విజయాన్ని అందించి ప్రజలు తమ మద్దతు తెలుపాలని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి కోరారు.
చామకూర మల్లారెడ్డిని ఎమ్మెల్యేగా మరోసారి అశీర్వదించి పరుగులు పెట్టిస్తున్న బోడుప్పల్ అభివృద్ధికి ఊతమివ్వాలని శనివారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గడిచిన మూడేండ్లలో రూ.250కోట్లపైగా నిధులతో బోడుప్పల్‌ను అభివృద్ధి పథంలో నడిపించడంలో మంత్రి మల్లారెడ్డి పాత్ర క్రీయాశీలకమైందని పేర్కొన్నారు.10,11డివిజన్లలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సుగుణబాలయ్య, శ్రీవిద్యచక్రపాణిగౌడ్, బొమ్మక్బాలయ్య, డివిజన్ ఇన్చార్జి జగదీశ్వర్‌రెడ్డి నాయకులు చక్రపాణిగౌడ్, సంతోశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి చేశాం..ఆశీర్వదించండి: మంద
శతాబ్ధికాలం అభివృద్ధిని దశాబ్దకాలంలో చేసి చూసిన ఘనత సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి మద్దతుగా స్థానిక నాయకులతో కలిసి శనివారం 4,17వ డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణ, నాయకులు వెంకట్‌రెడ్డి, 4వ డివిజన్ ఇన్చార్జి రమేశ్, 17వ డివిజన్ ఇన్చార్జి ప్రతాపరెడ్డి, ఉప్పలయ్య, శత్రజ్ఞ, విజయ్, శ్రీకాంత్, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఘట్కేసర్,పోచారం మున్సిపాలిటీల్లో..
ఘట్కేసర్,అక్టోబర్28:ఘట్కేసర్,పోచారం మున్సిపాలిటీల చైర్మన్లు పావనీ జంగయ్య యాదవ్, కొండల్‌రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు,బూత్ కమిటీల నాయకులు,కార్యకర్తలు కలిసి శనివారం మల్లారెడ్డికి మద్దతుగా వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. వార్డుల్లో జరిగిన అభివృద్ధిని ఓటర్లకు వివరిస్తూ, మ్యానిఫెస్టో పత్రాలను అందజేశారు.