కార్మికులకు ఈ శ్రమ్ భరోసా..

- పోర్టల్‌లో చేరితే బోలెడు లాభాలు
- స్పెషల్ డ్రైవ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 16,57,240 నమోదు
- జంట నగరాల్లో 1,20,836 మంది
చిక్కడపల్లి, డిసెంబర్ 31 : అసంఘటిత రంగంలోకి కార్మికుల శ్రేయస్సుకోసం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ పోర్టల్‌కు కార్మికుల నుంచి విశేషమైన స్పందలన లభిస్తున్నది. పోర్టల్‌లో పేర్లు నమోదు ప్రక్రియ గ్రేటర్ పరిధిలో వేగవంతంగా కొనసాగుతున్నది. అసంఘటిత కార్మిలందరూ ఈ-శ్రమ్ పోర్టలో పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అందుతాయి. ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు నమోదు కోసం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్(ఏఎల్ఓ)లు డిసెంబర్ నెలాఖరువరకు (రెండునెలల పాటు) ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
సామాజిక భద్రత..
ఈ కార్డులో ఉంటే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, వివిధ సంక్షేమ పతకాలు వర్తిసాయి. ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్బీవై) కింద రూ.2 లక్షలు, అంగవైకల్యం బీమా ఉచితంగా కల్పించడం జరుగుతుంది. 16 నుంచి 59 సంవత్సరాలలోపు, ఆదాయ పన్ను పరిధిలోకి రానివారు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం లేని వారు అర్హులు. అసంఘటిత రంగ కార్మిక కేటగిరిలో తప్పని సరిగా పనిచేస్తూ ఉండాలి.
అసంఘటిత కార్మికులందరూ నమోదు చేసుకోవాలి
జంటనగరాల్లో ఉన్న అసంఘటిత రంగ కార్మికుందరూ తమ పేర్లను తప్పనిసరిగా ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం రాష్ట్రంలోని అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు కోసం డిసెంబర్ నెలాఖరువరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. జంటనగరాల్లో 1,20,836 మంది పేర్లు నమోదు చేశాం. ఈ-శ్రమ్ పోర్టలో పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా కార్మికులకు సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అందుతాయి.
- డి.శ్యామ్‌సుందర్‌రెడ్డి, జంటనగరాల సంయుక్త కార్మిక కమిషనర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

