బంజారాహిల్స్, జనవరి 4: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 గజాల స్థలం కేటాయిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేలా చూడాలని ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు ఉద్యమకారులు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
గురువారం ఎమ్మెల్యేను కలిసిన తెలంగాణ ఉద్యమకారులు శంకర్. జెట్టి విజయ్‌కుమార్, నాగరాజు, శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే కేసులు నమోదైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అన్యాయమన్నారు.స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, ప్రసాద్, నర్సింహ, నక్కా రఘు, నర్సింగరావు, ప్రేమ్, నిషాంత్ తదితరులు పాల్గొన్నారు