హైదరాబాద్ : హైడ్రా(Hydraa) కూల్చివేతల పర్వంలో స్పీడ్ పెంచింది. ఇప్పుడు హైడ్రా చూపు మూసీపై పడటంతో మూసీ(Musi river) పరీవాహక ప్రాంతాల్లో అలజడి మొదలైంది. హైడ్రా బుల్డోజర్లు మూసీ నివా సాలపైకి విరుచుకు పడేందుకు సిద్ధం కావడంతో నిర్వాసితుల్లో కంటిమీద కునుకు కరువైంది. దీంతో
మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే కోసం(Authorities survey) వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకు న్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఖాళీ చేయబోమని కొత్తపేట, మారుతీనగర్, సత్యా నగర్ వాసులు తేల్చి చెప్పారు. దీంతో అధికారులు వెనుదిరిగారు.
కాగా, మూసీ నది ఒడ్డున పెద్ద ఎత్తున నివాసాలు ఉండటంతో వీటిని తొలిగిస్తే.. చాలా మంది రోడ్డున పడా ల్సిన పరిస్థితి వస్తుందని సామాజికవేత్తలు, మేధావులు ఆందోళన చెందుతున్నారు. పునరావాసం కల్పిం చడమంటే కేవలం నివాసం ఇస్తే సరిపోదని.. వారి ఆర్థిక స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే మూసీ నిర్వాసితుల నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్నా.. మేధావులు వారించినా ప్రభుత్వం మాత్రం కనికరం చూపకుండా కూల్చివేతలకే సిద్ధం కావడం గమనార్హం.
మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే.. అధికారులను అడ్డుకున్న స్థానికులు
హైదరాబాద్ – మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే కోసం వెళ్లిన అధికారులను అడ్డుకున్న స్థానికులు.
తాము ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఖాళీ చేయబోమని కొత్తపేట, మారుతీనగర్, సత్యా నగర్ వాసులు తేల్చి చెప్పారు.
దీంతో… pic.twitter.com/SbTUecjnFa
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2024