ఇద్దరు చిన్నారులకు కాలేయ మార్పిడి
ఉస్మానియా వైద్యులు మరోసారి ఘనత చాటారు. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహించారు. సోమవారం దవాఖానలోని ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వివరాలు వెల్లడించారు.
- ఉస్మానియా దవాఖాన ఘనత
సుల్తాన్‌బజార్, మార్చి 11: ఉస్మానియా వైద్యులు మరోసారి ఘనత చాటారు. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహించారు. సోమవారం దవాఖానలోని ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వివరాలు వెల్లడించారు. హుజురాబాద్ కమలాపూర్‌కు చెందిన సింధూజ(11), భువనగిరికి చెందిన వైష్ణవి(13)ల కాలేయాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఇద్దరు బాలికలకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు ఉస్మానియా వైద్యులు. బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి సేకరించిన కాలేయాలను వారికి విజయవంతంగా అమర్చారు.
5 రోజుల వ్యవధిలో సుమారు 20 గంటల పాటు శ్రమించి రెండు కాలేయ మార్పిడిలను విజయవంతంగా నిర్వహించిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హెచ్‌వోడీ డాక్టర్ మధుసూదన్,ప్రొఫెసర్ డాక్టర్ సుదర్శన్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండు నాయక్, డాక్టర్ పావని, డాక్టర్ మాధవిలను సూపరింటెండెంట్ ప్రత్యేకంగా అభినందించారు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ పూర్తి చేసుకున్న ఇద్దరు బాలికలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దవాఖాన అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, సీఎస్ అడ్మిన్ ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, డిప్యూటీ సీఎస్ అడ్మిన్ ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు, ఆర్ఎంవోలు డాక్టర్ సిద్ధిఖీ, డాక్టర్ సుష్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

