సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): గాంధీ జయంతి సందర్భంగా నేడు ట్రై కమిషనరేట్ల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు బంద్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన మద్యం విక్రయాలు జరిపితే లైసెన్స్లు రద్దు చేస్తామని, బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిషేధిత రోజుల్లో మద్యం విక్రయాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని ఆబ్కారీ అధికారులు తెలిపారు.