Wine Shops | సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రెండ్రోజుల పాటు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ‘నత్తనడకన చర్లపల్లి పనులు’ శీర్షికతో ‘నమస్తే’లో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్కు ప్రయాణికులు చేరుకునే విధంగా అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ శాఖ, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అక్కడున్న పరిశ్రమలను మరో చోటుకు తరలించాలన్నారు.