సిటీబ్యూరో, సెప్టెంబరు 9 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ, తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సహకారంతో సౌల్పేజ్ సాంకేతిక విశ్లేషణతో ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంపొందించడానికి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ మేరకు జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను డేటా (టిన్)ను విద్యుత్ కనెక్షన్లతో అనుసంధానించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం ఆరు జోన్లలో 96,938 నివాసాలకు సంబంధించిన ట్యాక్స్ టిన్ నంబర్లను అనుసంధానించడం ద్వారా గణనీయంగా ఆదాయం పెరుగుతుందని అదనపు కమిషనర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.