Future City | కడ్తాల్, మార్చి 11 : రేవంత్‌రెడ్డి సర్కార్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో… గతంలో రంగారెడ్డి జిల్లాలో కలిసిన నాలుగు మండలాల పరిధిలోని గ్రామాలకు అన్యాయం జరగుతున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కందుకూర్, కడ్తాల్, ఆమనగల్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల పరిధిలోని పలు రెవెన్యూ గ్రామాలను కలుపుకోని ఫ్యూచర్ సిటీ పేరుతో కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. గతంలో పాలమూరు జిల్లా నుండి రంగారెడ్డి జిల్లాలో కలిసిన… కడ్తాల్, ఆమనగల్లు మండలంలోని కొన్ని రెవెన్యూ గ్రామాలనే కార్పోరేషన్ పరిధిలోకి తేవకోవడానికి ప్రభుత్వం సిద్ధమైందని పేర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకోని… కడ్తాల్, ఆమనగల్లు మొత్తం మండలాలతోపాటు తలకొండపల్లి, మాడ్గుల్ మండలాలను కార్పోరేషన్ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. గతంలో రంగారెడ్డి జిల్లాలో కలిసిన నాలుగు మండలాలను కార్పోరేషన్ పరిధిలోకి తెచ్చేలా స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్షీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రామకృష్ణ, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సీహెచ్ మహేశ్, మాజీ సర్పంచ్‌లు తులసీరాంనాయక్, యాదయ్య, హరిచంద్‌నాయక్, శ్వేతాభూనాథ్నాయక్, లోకేశ్‌నాయక్, భారతమ్మ, నర్సింహాగౌడ్, మాజీ ఎంపీటీసీలు సువాలీ పంతూ నాయక్, ప్రియరమేశ్నాయక్, సాయిలు, మాజీ ఉప సర్పంచ్ పాండునాయక్, రైతు సమితి మాజీ అధ్యక్షుడు నర్సింహా, నాయకులు రామచంద్రయ్య, బాబా, శ్రీకాంత్, జంగయ్య, పాండు, శ్రీను, గోపాల్, జైపాల్, పాండు, రవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.