దుండిగల్, ఏప్రిల్ 4: బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, కష్టపడి పనిచేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేద్దామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి హిల్‌కౌంటీ లో బీఆర్ఎస్ పార్టీ నిజాంపేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ప్రణాళికాబద్ధంగా ఇంటింటికీ తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేసి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలపించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొన్నారు.