హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై బస్సులో మంటలు చెలరేగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పట్ల శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అలాగే ట్రావెల్స్ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.