MLA Devi Reddy Sudhir Reddy | దేవాలయాలను అభివృద్ధి చేస్తా
దేవాలయాల అభివృద్ధితో పాటు బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చింతలకుంటలోని ప్రలవిగార్డెన్లో నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
- బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
మన్సూరాబాద్, అక్టోబర్ 21: దేవాలయాల అభివృద్ధితో పాటు బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చింతలకుంటలోని ప్రలవిగార్డెన్లో నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అతి పెద్ద సర్వమతహిత ముక్తీఘాట్ను నిర్మించి అందులో బ్రాహ్మణులు అపరకర్మలు చేసుకునేందుకు భవనాన్ని నిర్మించామన్నారు. సాహెబ్నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లోని శ్మశానవాటికల్లోను అపరకర్మల భవనాన్ని నిర్మిస్తానని చెప్పారు.
వనస్థలిపురం హుడా బిల్డింగ్‌లో ఉన్న గాయత్రి భవన్‌ను బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్‌కు శాశ్వత ప్రాతిపదికన అందజేస్తామన్నారు. ఐదేండ్లలో ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. నామినేషన్‌కు అయ్యే ఖర్చు నిమిత్తం బ్రాహ్మణులందరూ ఒక్క రూపాయి చొప్పున ఇవ్వాలని కోరగా… వారు స్పందించి ఒక్కో రూపాయిని ఇచ్చి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి, జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ కమలాసుధీర్రెడ్డిని బ్రాహ్మణులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తులసి శ్రీనివాస్, టీబీఎస్ఎస్ఎస్ జంటనగరాల మాజీ అధ్యక్షుడు శ్రీధర్‌రావు, బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నందిరాజు లక్ష్మీనారాయణ, కార్యదర్శి జగన్మోహనాచారి, వాసుదేవరావు, కేఆర్ ప్రసాద్, చంద్రశేఖర్, శేషాచలపతి, మూర్తి, పీవీబీడీ శర్మ, స్వర్ణ శ్రీనివాసరావు, ఎంఎస్కే ప్రభు, సాదు శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

